Saturday, April 20, 2024
Homeసినిమాఆ విష‌యమై చిరును ప్ర‌శ్నించిన అమీర్

ఆ విష‌యమై చిరును ప్ర‌శ్నించిన అమీర్

బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌, కరీనా కపూర్ జంట‌గా నటించిన చిత్రం లాల్‌సింగ్ చడ్డా. ఇది హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్’ కు రీమేక్‌గా వ‌స్తుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య కీల‌క పాత్ర పోషిస్తుంచ‌డం విశేషం. ఇది నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ కావ‌డం విశేషం. ఈ క్రేజీ మూవీని అద్వైత్ చంద‌న్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆగ‌ష్టు 11న లాల్ సింగ్ చ‌డ్డా రిలీజ్ కానుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

చిరంజీవి విడుదల చేసిన ఈ సినిమా  ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. ఇదిలా ఉంటే.. గాడ్‌ ఫాదర్‌ మూవీలో తనని కాకుండా సల్మాన్‌ ఖాన్‌ను తీసుకోవడం పై చిరును ప్రశ్నించిన విషయాన్ని అమీర్ గుర్తు చేసుకున్నారు. ‘తెలుగు సినిమాల్లో నటించాలని ఉందా?’ అని చిరు తనను ఎప్పుడో అడిగారని  ‘మీ సినిమాలో నటించాలని ఉంది’ అని తాను చెప్పగా తప్పకుండా అవకాశం ఇస్తానని చిరంజీవి చెప్పారని వివరించారు అమీర్ ఖాన్.

‘గాఢ్ ఫాదర్ ‘లో సల్మాన్ ఖాన్‌ను తీసుకున్నప్పుడు చిరు తనకు ఫోన్ చేసి చెప్పార‌ని అమీర్ వెల్లడించారు. ‘నన్ను కాకుండా సల్మాన్‌ను ఎందుకు తీసుకున్నారు’ అని అడిగితే.. ‘ఇది హృదయం, బుద్ధిబలానికి సంబంధించిన పాత్ర కాదని, కండబలానికి ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో సల్మాన్‌ను ఎంపిక చేసుకున్నా’మని చిరు వివరించారని అమీర్ ఖాన్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read టాలీవుడ్ స్టార్స్ కి అమీర్ ఖాన్ స్పెష‌ల్ షో

RELATED ARTICLES

Most Popular

న్యూస్