Friday, September 20, 2024
HomeTrending Newsసలామ్‌ఎయిర్‌ విమానం సురక్షితం

సలామ్‌ఎయిర్‌ విమానం సురక్షితం

బంగ్లాదేశ్‌కు చెందిన సలామ్‌ఎయిర్‌  ఓవీ406 విమానం 200 మంది ప్రయాణికులతో బంగ్లాలోని చిట్టగాండ్‌ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌  వెళ్తున్నది. విమానంలోని కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని పైలట్‌ గుర్తించాడు. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌  కు సమాచారం అందించాడు. దీంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో విమానాన్ని దించడానికి అధికారులు అనమతించారు. ఈక్రమంలో విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అంబులెన్సులు, ఫైర్‌ ఇంజిన్లను సిద్ధం చేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

విమానంలో మొత్తం 200 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కార్గో ఏరియాలోనే పొగలు వచ్చాయని, ప్రయాణికులను పైలట్‌ అప్రమత్తం చేశాడని చెప్పారు. కాగా, బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అవడం ఇది రెండో సారి. 2021లో బైమన్‌ బంగ్లాకు చెందిన విమానం పైలట్‌కు గుండెపోటు రావడంతో అత్యవసరంగా విమానాశ్రయంలో దిగింది. ఇక గతనెల 22న ఎయిరిండియాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని నెవార్క్‌ నుంచి 300 మంది ప్రయాణికులకు న్యూఢిల్లీకి వస్తున్న విమానం.. ఇంజిన్‌లో ఆయిల్‌ లీకవడంతో స్వీడన్‌లోని స్టాక్‌హోంలో దిగిన విషయం తెలసిందే.
RELATED ARTICLES

Most Popular

న్యూస్