Wednesday, June 17, 2026
HomeసినిమాLungi Dance: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న వెంకీ, సల్మాన్, చరణ్

Lungi Dance: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న వెంకీ, సల్మాన్, చరణ్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’.  టాలీవుడ్ స్టార్ వెంకటేష్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే,  భూమిక నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదల చేసిన బతుకమ్మ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

అయితే.. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయనున్నారని వార్తలు వచ్చినా ఎవరూ ధ్రువీకరించలేదు. కానీ నిన్న విడుదలైన పాటతో దీనికి ఫుల్ స్టాప్ పడింది. ఈ మూవీ నుంచి ‘ఏంటమ్మా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ వెంకటేష్ తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించారు. సల్మాన్, వెంకటేష్ తో కలిసి చరణ్ లుంగీ స్టెప్పులు వేశారు.

ఈ పాటను ఇలా రిలీజ్ చేశారో లేదో… అలా యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది.  చిరు గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ స్పెషల్ సాంగ్ చేశారు. ఇప్పుడు సల్మాన్ అడిగిన వెంటనే చరణ్‌ ‘కిసికా భాయ్ కిసీకా జాన్’ లో గెస్ట్ రోల్ చేయడానికి ఓకే చెప్పారు. ఈ నెల 21న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular