Friday, March 20, 2026
Homeసినిమాచిరుకు స‌ల్మాన్ స్వీట్ వార్నింగ్?

చిరుకు స‌ల్మాన్ స్వీట్ వార్నింగ్?

Salmaan gesture: మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘ఆచార్య‘ ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే చిరంజీవి.. గాడ్ ఫాద‌ర్ మూవీ స్టార్ట్ చేశారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ ల పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. చిరంజీవికి స‌ల్మాన్ ఖాన్ షాక్ ఇచ్చార‌ట‌. ఇది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే… సల్మాన్ ఖాన్ కి, మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి అంటే స‌ల్మాన్ కు అమితమైన గౌరవం.  ఈ  బంధంతోనే చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ లో స‌ల్మాన్ గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ గెస్ట్ రోల్ కోసం రెమ్యూనరేషన్ తీసుకోనని చిరుకు కండిషన్ పెట్టాడట సల్లు భాయ్. ఒకవేళ బలవంతంగా పారితోషికం ఇస్తానంటే సెట్ నుంచి వెళ్లిపోతానని చెప్పారట.. కేవలం ఈ పాత్ర చిరు మీద అభిమానంతో మాత్రమే చేస్తున్నానని, డబ్బు కోసం కాదని చెప్పార‌ట‌. స‌ల్మాన్ ఇలా చెప్ప‌డంతో చిరంజీవి షాక్ అయ్యార‌ట‌. ప్రస్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో స‌ల్మాన్ మ‌న‌సు ఎంత గొప్ప‌దో అంటూ అభిమానులు అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular