Saturday, January 18, 2025
Homeసినిమాసీటీమార్ సెన్సేషన్

సీటీమార్ సెన్సేషన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్ర‌భుదేవా కాంబినేషన్ లో రూపొందిన చిత్రం రాధే. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిచిన ఈ చిత్రంలోని సీటీమార్ సాంగ్‌ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ పాట 100మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ క్రాస్ చేసి యూ ట్యూబ్‌లో ఫాస్టెస్ట్ 100 మిలియ‌న్ వ్యూస్‌ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిన సంద‌ర్భంగా స‌ల్మాన్ ఖాన్‌, ప్ర‌భుదేవా రాక్‌స్టార్‌ దేవీని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ సంద‌ర్బంగా సీటీమార్ సాంగ్‌కి స‌ల్మాన్‌ఖాన్ డ్యాన్స్ చేసిన విజువ‌ల్స్‌తో పాటు దేవి డ్యాన్స్ చేస్తున్న విజువ‌ల్స్‌ను ఒక స్పెష‌ల్ వీడియో రూపంలో రిలీజ్ చేసి స‌ల్మాన్‌ఖాన్‌, ప్ర‌భుదేవా మ‌రియు రాధే చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ తెలిపారు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌.  సీటీమార్‌తో బాలివుడ్ ని ఉర్రూతలూగిస్తున్న దేవిశ్రీ త్వ‌ర‌లోనే రెండు భారీ హిందీ చిత్రాల‌కు సంగీతం అందించనున్నారు. ఆ  చిత్రాల వివ‌రాల‌ను అతి త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయ‌బోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్