Monday, March 16, 2026
Homeసినిమా‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ భాయ్ గెస్ట్ రోల్

‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ భాయ్ గెస్ట్ రోల్

Salman Khan with Mega Star:
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్’ అనే భారీ చిత్రంలో న‌టిస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఇది మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన ‘లూసిఫ‌ర్’కి రీమేక్.  దీనికి మోహ‌న్ రాజా ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులు నుంచి వార్తలు వ‌స్తున్నాయి. అయితే.. ఇది గాసిప్ అనుకున్నారు కానీ వాస్తవ‌మే అని తెలిసింది.

తాజా అప్ డేట్ ఏంటంటే.. ఫిబ్రవ‌రి నుంచి ‘గాడ్ ఫాద‌ర్’ షూటింగ్ లో స‌ల్మాన్ ఖాన్ పాల్గొంటార‌ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కండల వీరుడి పాత్రకు సంబంధించిన షూటింగ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం. దీని కోసం సల్మాన్ 15 రోజుల సమయాన్ని కేటాయించనున్నార‌ని తెలిసింది. చిరంజీవి, రామ్ చరణ్ లతో సల్మాన్ ఖాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుక‌నే.. కనీసం త‌న పాత్ర గురించి కూడా అడగకుండానే.. బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ గాడ్ ఫాదర్ లో గెస్ట్ రోల్ చేయడానికి వెంటనే అంగీకరించారట‌.

చిరుతో క‌లిసి స‌ల్మాన్ న‌టించ‌నున్నార‌ని తెలిసిన‌ప్పటి నుంచి గాడ్ ఫాద‌ర్ మూవీ పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయ‌ని చెప్పవచ్చు. న‌య‌న‌తార‌, స‌త్య‌ దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Also Read : ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల పై స‌ల్మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular