Sunday, January 19, 2025
Homeసినిమాచిరు, స‌ల్మాన్ ల షూట్ కి ముహుర్తం ఫిక్స్?

చిరు, స‌ల్మాన్ ల షూట్ కి ముహుర్తం ఫిక్స్?

Sallu Bhayya coming: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ త‌ర్వాత వెంట‌నే సెట్స్ పైకి తీసుకెళ్లిన చిత్రం ‘గాడ్ ఫాద‌ర్’. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ మూవీకి రీమేక్ ఇది. అయితే.. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేర్పులుతో ఈ గాడ్ ఫాద‌ర్ మూవీ రూపొందుతోంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు గాసిప్ అని మొదట అనుకున్న‌ప్ప‌టికీ ఆత‌ర్వాత అది వాస్త‌వ‌మే అని తెలిసింది.

మ‌రి… గాడ్ ఫాద‌ర్ సెట్స్ లోకి స‌ల్మాన్ వ‌చ్చేది ఎప్పుడంటే… వచ్చేనెలలో షూటింగ్ లో పాల్గొనబోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. కరోనా కేసులు తగ్గి పరిస్థితులు అనుకూలిస్తే.. ఫిబ్రవరిలోనే సల్మాన్ షెడ్యూల్ ను పూర్తి చేసేలా డేట్లు తీసుకున్నారట. ఒక వేళ ఫిబ్రవరిలో సాధ్యం కాకుంటే.. మార్చిలో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. భారీ అంచనాల‌తో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిసింది.

చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేష‌న్లో వచ్చే సన్నివేశాలు అత్యంత కీలకంగా ఉంటాయని.. సల్మాన్ కనిపించేది కొద్ది సేపే అయిన‌ప్ప‌టికీ సినిమాకు హైలైట్ అవుతుందని.. అలాగే చిరుతో క‌లిసి స‌ల్మాన్ స్టెప్స్ వేయ‌నున్నార‌ని.. ఈ సాంగ్ ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. ఇంతకీ గాడ్ ఫాద‌ర్ విడుద‌ల‌ ఎప్పుడంటే.. ఆచార్య విడుద‌లైన‌ రెండు మూడు నెలల్లోనే చిరంజీవి గాడ్ ఫాదర్ ను విడుదల చేయాలి అనుకుంటున్నార‌ని స‌మాచారం.

Also Read : ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ భాయ్ గెస్ట్ రోల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్