Thursday, March 28, 2024
Homeసినిమాప్ర‌భాస్ వ‌రుస‌గా ఇన్ని ప్రాజెక్ట్స్ చేయ‌డానికి కార‌ణం?

ప్ర‌భాస్ వ‌రుస‌గా ఇన్ని ప్రాజెక్ట్స్ చేయ‌డానికి కార‌ణం?

Prabhas – Unstoppable: ‘బాహుబ‌లి’ తో చ‌రిత్ర సృష్టించిన ప్ర‌భాస్.. ఆత‌ర్వాత ఎలాంటి సినిమాలు చేస్తాడో..? త‌నకు వ‌చ్చిన‌ ఇమేజ్ ను ఎంత వ‌ర‌కు కాపాడుకుంటాడో అనుకుంటే… వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ… సూప‌ర్ లైన‌ప్ తో కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ఇంకా చెప్పాలంటే… ప్ర‌భాస్ త‌న పాన్ ఇండియా లైన‌ప్ తో అంద‌రికీ షాక్ ఇస్తున్నాడ‌ని చెప్ప‌చ్చు. రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఆదిపురుష్ మూవీ కంప్లీట్ అయ్యింది.

స‌లార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. స్పిరిట్ మూవీని అనౌన్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య ప్ర‌భాస్ కు 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అస‌లు ప్ర‌భాస్ ఇన్ని ప్రాజెక్ట్‌ లకు సైన్ చేయడానికి కార‌ణం ఏంటి..? ఎందుకు అంత ఆత్రుతగా ఉన్నాడు? అస‌లు ప్ర‌భాస్ గేమ్ ప్లాన్ ఏమిటి.? అంటే… తనకున్న స్టార్ డమ్‌ని, క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నాడని ఇండ‌స్ట్రీలో ఇన్‌సైడ్‌వర్గాలు చెబుతున్నాయి.

బాలీవుడ్ టాప్ స్టార్స్ భారీ హిట్స్ అందించడానికి కష్టపడుతున్నారు. నార్త్ ఇండియన్ ప్రేక్షకులు సౌత్ ఇండియన్ సినిమాల కోసం ఆస‌క్తిగా చూస్తున్నారు. సౌత్ ఇండియన్ కంటెంట్ పట్ల ఈ మానియా ఎంత కాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి, పాపులారిటీ పీక్స్‌ లో ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవడం మంచిదనే ఉద్దేశ్యంతోనే ప్ర‌భాస్ ఇలా వ‌రుస‌గా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేసేందుకు ఓకే చెబుతున్నాడ‌ని అంటున్నారు సినీ జ‌నాలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్