Sunday, January 19, 2025
Homeసినిమా చిరు గాడ్ ఫాద‌ర్ కోసం రంగంలోకి స‌ల్మాన్

 చిరు గాడ్ ఫాద‌ర్ కోసం రంగంలోకి స‌ల్మాన్

Salman entered: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాద‌ర్. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ మూవీకి రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమా చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే.. లూసీఫ‌ర్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర‌ను తెలుగు రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తుండ‌డం విశేషం.

ఈ భారీ చిత్రాన్ని చ‌రణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఇందులో స‌ల్మాన్ న‌టిస్తున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఇన్నాళ్లు స‌ల్మాన్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కాలేదు. ఇప్పుడు ముంబాయి స‌మీపంలోని ఎన్డీ స్టూడియోస్ లో ఈ నెల 12 నుంచి షూటింగ్ ప్లాన్ చేశారు. వారం రోజులు పాటు షూటింగ్ చేయ‌నున్నారు. దీంతో ఈ షెడ్యూల్ పూర్త‌వుతుంది. అప్ప‌టి వ‌ర‌కు స‌ల్మాన్ ఫామ్ హౌస్ లో చిరంజీవి ఉంటారట. అత్యంత విలాసవంతమైన ఈ ఫామ్ హౌస్ లో సల్మాన్ కి అత్యంత ఆత్మీయులు మాత్రమే విడిది చేస్తారట. చిరు, స‌ల్మాన్ పై వ‌చ్చే స‌న్నివేశాలు ఆడియ‌న్స్ ని విశేషంగా ఆక‌ట్టుకునేలా ప్లాన్ చేశార‌ని స‌మాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్