Wednesday, June 17, 2026
Homeసినిమా'సామజవరగమన' నుంచి టీజర్ రిలీజ్..!

‘సామజవరగమన’ నుంచి టీజర్ రిలీజ్..!

శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని భరోసా ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. సాధారణంగా తమ వెంటపడి వేధించే అబ్బాయిలతో అమ్మాయిలు రాఖీ కట్టించుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమాలో హీరో రాఖీలు జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. తన వెంటపడిన అమ్మాయిలతో స్పాట్ లోనే రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు. అందుకు కారణం ఏమిటనేదే కథ.

టీజర్ చూస్తేనే శ్రీవిష్ణు పాత్ర ద్వారా కావలసినంత కామెడీని అందించనున్నారని తెలుస్తోంది. ఇక లోకల్ మాస్ పార్టీ లీడర్ లుక్ తో వెన్నెల కిశోర్ కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర హాయిగా నవ్విస్తుందనే విషయం అర్థమవుతోంది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా శ్రీవిష్ణుకి హిట్ ఇస్తుందేమో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular