Friday, March 13, 2026
HomeTrending NewsAkhilesh Yadav: కెసిఆర్ తో సమావేశమైన అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: కెసిఆర్ తో సమావేశమైన అఖిలేష్ యాదవ్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ హైదరాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఇద్ద‌రు నేతలు చ‌ర్చిస్తున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్న అఖిలేష్ యాద‌వ్‌కు సీఎం కేసీఆర్ సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్ర‌త్యేక విమానంలో చేరుకున్న అఖిలేష్ యాద‌వ్‌కు మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అటు నుంచి నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు.

ప్రగతి భవన్‌లో అఖిలేష్ యాదవ్ దాదాపు 3 గంటల పాటు ఉండనున్నారు. అనంతరం ఆయన తిరిగి లక్నోకు బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో  అఖిలేష్ కేసీఆర్ చాలాసార్లు సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించారు. అయితే, జులై 13,14 తేదీల్లో బెంగళూరుతో జరిగే సెకండ్ మీటింగ్ కు ముందు అఖిలేష్ కేసీఆర్ ను కలవడం వెనుకున్న మతలబ్ ఏంటనే క్లారిటీ రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular