Sunday, January 19, 2025
Homeసినిమానేను ఫైట్లు ఇంత బాగా చేస్తానని నాకే తెలియదు: సమంత  

నేను ఫైట్లు ఇంత బాగా చేస్తానని నాకే తెలియదు: సమంత  

ఒక వైపున హీరోల జోడీ కడుతూనే, మరో వైపున లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ సమంత ముందుకు దూసుకెళుతోంది. ‘యూ టర్న్’ .. ‘ఓ బేబీ’ .. ‘జాను’ వంటి సినిమాల తరువాత ఆమె చేసిన నాయిక ప్రధానమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘యశోద’ రెడీ అవుతోంది. సరోగసి నేపథ్యంలో అల్లుకున్న ఆసక్తికరమైన కథ ఇది. హరిశంకర్ .. హరీశ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ఐదు భాషల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో సమంత ఈ సినిమాను గురించి మాట్లాడారు.

యశోద’ కథను వినగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి ఒక మంచి కథను వదులుకోకూడదని భావించి ఓకే అనేశాను. ఎమోషన్ తో కూడిన థ్రిల్లర్ సినిమా ఇది. ఇంతవరకూ నేను ఈ తరహా సినిమా చేయలేదు. కొత్త పాయింటుతో వస్తున్న సినిమా కావడం వలన, మరో సినిమాతో పోల్చడానికి అవకాశం లేని సినిమా ఇది. ఈ సినిమాలో నేను ఫైట్లు కూడా చేయవలసి వచ్చింది. రోప్ .. డూప్ లేకుండా ఫైట్లు చేశాను. తెరపై ఈ ఫైట్స్ చాలా థ్రిల్ చేస్తాయి.  క్లైమాక్స్ కి ముందు వచ్చే యాక్షన్ సీన్ నాకు బాగా నచ్చింది. ఆడియన్స్ కి అది బాగా కనెక్ట్ అవుతుంది కూడా.

నిజం చెప్పాలంటే ‘యశోద’కి ముందు నేను ఇంత బాగా ఫైట్లు చేయగలుతానని నాకే తెలియదు. ఇప్పుడు నేను డాన్సుల కంటే ఫైట్లు బాగా చేయగలుగుతాననే విషయం అర్థమైంది. ఈ సినిమాను థియేటర్లోనే చూడాలి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ఆల్రెడీ ఈ సినిమాను నేను చూశాను. ఆడియన్స్ కి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం కలిగింది. ఆ కాన్ఫిడెన్స్ వలన కొంచెం టెన్షన్ కూడా పడుతున్నాను” అంటూ  చెప్పుకొచ్చారు. ఇప్ప్పటికే ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఉంది. ఆ అంచనాలను ‘యశోద’ ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

Also Read : యశోద లో మరో ఆసక్తికరమైన అంశం వరలక్ష్మి పాత్రనే!   

RELATED ARTICLES

Most Popular

న్యూస్