Saturday, June 6, 2026
Homeసినిమా'ఖుషీ' టీమ్ కి షాక్ ఇచ్చిన సమంత.

‘ఖుషీ’ టీమ్ కి షాక్ ఇచ్చిన సమంత.

విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఖుషీ‘. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రేమకథా చిత్రాలను చాలా చక్కగా తెరకెక్కించ గల శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఖుషీ మూవీ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. లైగర్ మూవీతో డిజాస్టర్ చూసిన విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే.. సమంత వయోసైటిస్ వలన షూటింగ్ కు బ్రేక్ పడింది.

దాని వల్ల ఖుషీ సినిమాలో తన పాత్ర గురించి ఎక్కువ ఆలోచించే ఛాన్స్ దొరికింది. అందుకే ఖుషీ టీమ్ కు షాక్ ఇస్తూ కథ మార్చమన్నట్టు తెలుస్తుంది. కథలో తన పాత్ర చాలా బలహీనంగా ఉందని.. తన ఇమేజ్ కు తగినట్టుగా కథలో కొద్దిపాటి మార్పులు చేయాలని చెప్పిందట. శివ నిర్వాణ తన మొదటి సినిమా నుంచి ప్రయోగాత్మక కథలనే చేస్తూ వస్తున్నాడు. అతను చేసిన దానిలో టక్ జగదీష్ ఒక్కటే అంచనాలను అందుకోలేదు కానీ నిన్ను కోరి, మజిలీ ఈ రెండు మంచి చిత్రాలు గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించాయి.

అందుకే శివ మీద నమ్మకం ఉంచి సమంత కమిట్ అవ్వొచ్చు.. ఆల్రెడీ మజిలీ సినిమాలో అతనితో పని చేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి డైరెక్టర్ ని నమ్మొచ్చు. అయితే.. ఖుషీ విషయంలో సమంత ఎందుకో తన పట్టు విడవట్లేదని అంటున్నారు. త్వరలోనే సమంత ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానుంది. షూటింగ్ తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత నాన్ స్టాప్ గా షూటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. సమంతకు నచ్చినట్టు కథలో మార్పులు చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

Also Read : ఖుషీ ప్లాన్ మారిందా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular