Sunday, June 7, 2026
Homeసినిమాసమంత ద్విభాషా చిత్రానికి ఇద్దరు దర్శకులు

సమంత ద్విభాషా చిత్రానికి ఇద్దరు దర్శకులు

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ఇద్దరు యువకులు హరి–హరీష్‌ దర్శకత్వం వహించనున్నారు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెం 14గా తెరకెక్కనున్నఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘విభిన్న కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణ గారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరోమూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. చాలా కొత్తగా ఉంటుందీ సినిమా. సమంత గారు కథ వినగానే ఎగ్జైట్‌ అయ్యారు. వెంటనే ఓకే చెప్పారు. హరి, హరీష్‌ దర్శక ద్వయాన్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. నవంబర్‌లో తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular