Saturday, July 27, 2024
Homeసినిమాసమంత చేతుల మీదుగా "పుష్పక విమానం" సాంగ్

సమంత చేతుల మీదుగా “పుష్పక విమానం” సాంగ్

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. గీత్ సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “పుష్పక విమానం” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ లోగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే సిలకా..అనే పాట లిరికల్ వెర్షన్ రిలీజ్ చేశారు. యూత్ ను, మాస్ ను ఆకట్టుకున్న ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేయబోతోంది చిత్ర యూనిట్. ‘కళ్యాణం’ లిరికల్ సాంగ్ ను ఈ నెల 18న శుక్రవారం ఉదయం 11 గంటలకు స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేయనున్నారు. హీరో హీరోయిన్ల వివాహం సందర్భంగా వచ్చే ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, సిధ్ శ్రీరామ్, మంగ్లీ పాడారు. రామ్ మిరియాల సంగీతం “పుష్పక విమానం”కు ఓ అస్సెట్ కాబోతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్