Saturday, January 18, 2025
Homeసినిమానవంబర్ 11న‌ 'యశోద' విడుదల

నవంబర్ 11న‌ ‘యశోద’ విడుదల

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద‘. శ్రీదేవి మూవీస్ పతాకంపై  శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి, హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కథ, కథనం, నిర్మాణ విలువల్లోనే కాకుండా చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా రొటీన్ కి భిన్నంగా వెళుతున్న చిత్ర టీం, విడుదల తేదీ పోస్టర్ ని వినూత్నంగా అభిమానులు ద్వారా విడుదల చేశారు.

నిర్మాత మాట్లాడుతూ ”ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు. కానీ, ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. వినూత్నమైన కథతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ‘యశోద’. టైటిల్ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకుని, చాలా ఎఫర్ట్స్ పెట్టి క్యారెక్టర్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు. నవంబర్ 11, 2022న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తాం” అని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్