Saturday, January 18, 2025
HomeTrending Newsకెసిఆర్ తోనే నా యుద్ధం - రాజగోపాల్ రెడ్డి

కెసిఆర్ తోనే నా యుద్ధం – రాజగోపాల్ రెడ్డి

త్వరలో కేసీఆర్ పై యుద్ధం ప్రకటించబోతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఉద్దేశ్య పూర్వకంగా మూడున్నర ఏళ్ళుగా కేసీఆర్ మునుగోడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు తనను గెలిపించారన్న కోపంతో ఎస్ ఎల్ బీసీ ,బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులు చేయడం లేదని ఈ రోజు హైదరాబాద్ లో రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.

కిష్టరాయిపల్లి భూనిర్వాసితులకు ,మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు ఇచ్చినట్లు నష్ట పరిహారం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేమర్శించారు. తాను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తి లేదని, గజ్వేల్ ,సిరిసిల్ల, సిద్దిపేటలా అభివృద్ధి చేస్తా అంటే..నేను రాజీనామా చేస్తా అని ఎప్పుడో ప్రకటించానని స్పష్టం చేశారు. నా సొంత అవసరాల కోసం చేస్తున్న పోరాటం కాదని, నా నియోజకవర్గ ప్రజలతో చర్చించాకే..కేసీఆర్ పై సమరశంఖం పూరించాలని నిర్ణయించానని ఆయన వెల్లడించారు. తన నిర్ణయానికి మునుగొడు నియోజకవర్గ అన్ని వర్గాల వారు మద్దతు ఇస్తున్నారని, మరోసారి విస్తృతంగా అందరితో చర్చించి కురుక్షేత్ర యుద్దానికి సమరశంఖం పూరిస్తానని రాగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు రాజగోపాల్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్