Sunday, June 7, 2026
Homeసినిమా‘పుష్ప 'సామి సామి' సాంగ్ ప్రోమోకు అనూహ్య స్పందన

‘పుష్ప ‘సామి సామి’ సాంగ్ ప్రోమోకు అనూహ్య స్పందన

అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న పుష్ప మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ‘సామి సామి’ అంటూ సాగే మూడో సింగిల్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అక్టోబర్ 28, ఉదయం 11.07 నిమిషాలకు పూర్తి పాట విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular