Monday, September 30, 2024
Homeసినిమాగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్క‌లు నాటిన సంప‌త్ నంది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్క‌లు నాటిన సంప‌త్ నంది.

Green India:  సినిమా దర్శకుడు సంపత్ నంది తన పుట్టినరోజు సందర్భంగా కడ్తాల్ లోని తన ఫాంహౌజ్ లో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్‘ను స్ఫూర్తిగా తీసుకొని ‘సింబా’ చిత్ర యూనిట్ తో కలిసి వంద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… సినీ డైరెక్టర్ సంపత్ నంది గ్రీన్ ఇండియా చాలెంజ్  స్ఫూర్తితో తన జన్మదినం సందర్భంగా ‘సింబా’ చిత్ర యూనిట్ తో కలిసి మొక్కలను నాటడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సినిమా కూడా ఫారెస్ట్ ఆఫీసర్ నేపధ్యంతో ప్రకృతికి దగ్గరగా  నిర్మిస్తుండటం గొప్ప విషయమన్నారు. ‘సింబా’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందన్న ఆశాభావాన్ని ఎంపీ సంతోష్ కుమార్ వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియ‌చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్