Saturday, January 18, 2025
Homeసినిమాసంపూ ‘క్యాలీ ఫ్లవర్’ ఫస్ట్ లుక్

సంపూ ‘క్యాలీ ఫ్లవర్’ ఫస్ట్ లుక్

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన‌ కొబ్బరిమట్ట చిత్రాన్ని ప్రేక్షకులకు సూపర్‌హిట్‌ చేశారు. తాజాగా మరో కొత్త క్రేజీ కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకులను ఆలరించడానికి రెడీ అయ్యారు సంపూర్ణేష్‌ బాబు. క్యాలీ ఫ్లవర్‌ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. మే 9 సంపూర్ణేష్‌ బాబు బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేక‌ర్స్‌. ‘క్యాలీఫ్లవర్‌’ సినిమాలోని సంపూర్ణేష్‌బాబు ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తుంది. ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తి గెటప్‌లో సంపూ లుక్‌ అదిరిపోయింది.

అలాగే సంపూ మార్క్‌స్టైల్‌ ఈ ఫస్ట్‌ లుక్‌ లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్‌ బ్యాంగ్‌ వీడియోలో సంపూ అలరించిన తీరు ‘క్యాలీఫ్లవర్‌’ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. మరోసారి సంపూ స్టైల్‌ ఆఫ్‌ కామెడీని ‘క్యాలీఫ్లవర్‌’ చిత్రంతో హాస్య ప్రియులు ఎంజాయ్‌ చేయనున్నార‌ని తెలుస్తోంది. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముజీర్‌ మాలిక్‌ ఛాయగ్రాహకుడు. ఎడిటింగ్‌ బాధ్యతలను బాబు నిర్వ హిస్తున్నారు.

సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్‌ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్‌ దీప్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్కే మలినేని, ప్రొడ్యూసర్‌: ఆశా జ్యోతి గోగినేని.

RELATED ARTICLES

Most Popular

న్యూస్