Sunday, January 19, 2025
Homeసినిమాసంపూర్ణేష్ బాబు 'ధగడ్ సాంబ' సాంగ్ చిత్రీకరణ

సంపూర్ణేష్ బాబు ‘ధగడ్ సాంబ’ సాంగ్ చిత్రీకరణ

Dhagad Samba Shooting : ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ధగడ్ సాంబ”   బి.ఎస్ రాజు సమర్పణలో నిర్మాత అర్.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల  సారథి స్టూడియోలో చివరి పాట చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ధగడ్ సాంబ సినిమా. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది.

కామెడీ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ సంపూర్ణేష్ ఈ సినిమాలో చేశారు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. మూవీలోని పాటల కోసం అద్భుతమైన సెట్స్ వెయ్యడం జరిగింది. పాటలకు సంపూర్ణేష్ తనదైన శైలిలో స్టెప్స్ వెయ్యడం జరిగింది. ధగడ్ సాంబ చిత్రంలో హీరోయిన్ సోనాక్షి నటన అదనపు ఆకర్షణ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకొని త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Read : మహేష్, దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్