Saturday, January 18, 2025
Homeసినిమాతెలుగు తెరకి బీహార్ బ్యూటీ!

తెలుగు తెరకి బీహార్ బ్యూటీ!

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు పరిచయమయ్యారు. మరికొంతమంది హీరోయిన్స్ ఫస్టు టైమ్ చేసిన సినిమాలు త్వరలో థియేటర్లకు రానున్నాయి. అలా రేపు విడుదలవుతున్న ‘ఫస్టు డే ఫస్టు షో’ సినిమా ద్వారా మరో బ్యూటీ పరిచయమవుతోంది .. బీహార్ కి చెందిన ఆ బ్యూటీ పేరే సంచితా బషు. ముద్దుగా .. ముద్దబంతిలా కనిపించే ఈ అమ్మాయి అరమోడ్పు కనులతో ఆకట్టుకుంటోంది. మత్తు చూపులతో కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేస్తోంది. నిన్న  రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ మాట్లాడుతూ, ఈ సుందరి నవ్వు .. కళ్లు బాగున్నాయని మెచ్చుకోవడం విశేషం.

సంచిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆ ఫ్లాట్ ఫామ్ పై ఆగకుండా ఈ అమ్మాయి చేసే అందమైన అల్లరి .. సందడి అంతా ఇంతా కాదు. గతంలో టిక్ టాక్ లతో చెలరిగిపోయిన ఈ బ్యూటీ, ఇటీవల కాలంలో షార్ట్స్ ద్వారా మరింత పాప్యులర్ అయింది. ఆమె ఫాలోవర్స్ ను ఫాలోకావడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మాయి చాలామందికి తెలుసు కనుక, సినిమాల ద్వారా కూడా తొందరగానే కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తను కూడా అదే విధమైన ఆలోచనలో ఉంది.

తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా మిగిలిపోయే సినిమాలను అందించిన పూర్ణోదయా క్రియేషన్స్ ‘ఫస్టు డే ఫస్టు షో’ సినిమా వస్తోంది. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు ‘శ్రీజ’ ఈ సినిమాతో నిర్మాతగా మారుతోంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ ఈ సినిమాకి కథను అందించగా, ఆయన స్నేహితులు వంశీధర్ – లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించారు. రేపు విడుదలవుతున్న ఈ సినిమాపై సంచితా గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఈ అమ్మాయి కెరియర్ గ్రాఫ్ ను ఏ స్థాయిలో పరుగులు తీయిస్తుందనేది చూడాలి.

Also Read : డైరెక్ట‌ర్స్ కి మ‌రోసారి క్లాస్ తీసుకున్న మెగాస్టార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్