Thursday, March 28, 2024
Homeసినిమాడైరెక్ట‌ర్స్ కి మ‌రోసారి క్లాస్ తీసుకున్న మెగాస్టార్

డైరెక్ట‌ర్స్ కి మ‌రోసారి క్లాస్ తీసుకున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి.. ఆమ‌ధ్య ‘లాల్ సింగ్ చ‌డ్డా’ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా  డైరెక్ట‌ర్స్ కి క్లాస్ తీసుకున్నారు.  “కొంత మంది డైరెక్ట‌ర్స్ సెట్ కి వ‌చ్చిన త‌ర్వాత డైలాగులు రాస్తున్నారు. అలా చేయ‌డం వ‌ల‌న టైమ్ వేస్ట్ అవుతుంది. అలాగే అప్ప‌టిక‌ప్పుడు డైలాగులు రాయ‌డం వ‌ల‌న ఆర్టిస్టు ఆ డైలాగులు నేర్చుకోవ‌డం పై దృష్టి పెట్టాలో.. ప‌ర్ ఫార్మెన్స్ పై దృష్టి పెట్టాల‌తో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. త‌న‌కి అలాంటి అనుభ‌వం ఎదురైంద‌”ని చిరంజీవి చెప్పారు.

చిరంజీవి ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ “ఇప్పుడు ఓటీటీ రావ‌డం వ‌ల‌న జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని.. ఇంట్లోనే కూర్చొని సినిమా చూడ‌డానికి అల‌వాటు ప‌డ్డార‌ని అంటున్నారు. దీని వ‌ల‌న  సినిమా ఇండ‌స్ట్రీకి గ‌డ్డు కాలం న‌డుస్తుంది అంటున్నారు కానీ.. మంచి కంటెంట్ తో సినిమా తీస్తే ఖ‌చ్చితంగా చూస్తారు. ఇటీవ‌ల రిలీజై స‌క్సెస్ సాధించిన బింబిసార‌, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలే దీనికి ఉదాహ‌ర‌ణ‌. అందుచేత కెప్ట‌న్ ఆఫ్ ది షిప్ అయిన‌ ద‌ర్శ‌కులు మంచి కంటెంట్ పై దృష్టి పెట్టాల‌ని కోరుతున్నాను. కంటెంట్ ఈజ్ కింగ్. మంచి కంటెంట్ తో సినిమా తీస్తే ఆడియ‌న్స్ త‌ప్ప‌కుండా చూస్తారు.. మంచి విజ‌యాన్ని అందిస్తారు అంతే కానీ.. డేట్స్ దొరికియా క‌దా అని ఏదో తీసేస్తే జ‌నాలు చూడ‌రు” అన్నారు చిరంజీవి. డైరెక్ట‌ర్స్ గురించి చిరంజీవి చెప్పిన మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

Also Read చిరంజీవికి బహిరంగ లేఖ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్