Monday, June 15, 2026
Homeసినిమాఫైట్ తో ప్రారంభిస్తున్న మ‌హేష్‌

ఫైట్ తో ప్రారంభిస్తున్న మ‌హేష్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందనున్న మూవీ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో  మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

అయితే.. ఫైట్ సీన్ తోనే షూటింగ్  స్టార్ట్  కానుందని తెలిసింది. రామోజీ ఫిలింసిటీలో మ‌హేష్ బాబు, కొంత మంది ఫైట‌ర్స్ పై ఈ ఫైట్ సీన్ ను చిత్రీక‌రించనున్నారు. ‘ఖలేజా’ ఆరంభంలో ఓ ఫైట్ వుంటుంది. ఇప్పటికీ మహేష్ అభిమానులకు గుర్తుండిపోయే ఓపెన్ ఎయిర్ ఫైట్ అది. త్రివిక్రమ్  ‘అరవింద సమేత’ లో  కూడా ఫైట్ తోనే సినిమా మొదలు పెట్చిటారు. ‘మంది లేరా.. కత్తుల్లేవా ‘అంటూ ఎన్టీఆర్ ఘర్జించే ఫైట్ అది. అది కూడా మెమరబుల్ నే.

ఈ రెండూ సినిమాలను కలబోసిన రేంజ్ అన్నట్లుగా ఓ ఫైట్ ను మహేష్ కోసం ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. వచ్చే ఏడాది వేసవి విడుదల టార్గెట్ గా ఈ సినిమాను ప్రారంభిస్తున్నారు. ఆ టైమ్ కు రెడీ అవుతుందా లేదా అన్నది కొంత వర్క్ అయితే తప్పా  క్లారిటీ రాదు.

Also Read : ఆ వార్తలో నిజం లేదు : తరుణ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular