Thursday, April 25, 2024
Homeసినిమాప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్?

ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌ సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాల‌తో పాటు యూత్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతితో కూడా ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ మూవీని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, యువి క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అయితే.. ఈ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే… ఈ మూవీ కోసం అదిరిపోయే రేంజ్ లో థ్రిల్లింగ్ కమర్షియల్ జానర్ స్టోరీని సిద్ధం చేశారట మారుతి. ఒకింత కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో పాటు హర్రర్ కూడా ఉంటుంద‌ట‌. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయనున్నారని అంటున్నారు. అది కూడా తాత, మనవడి పాత్రల్లో ఈ మూవీలో ప్రభాస్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ రెండు పాత్రలకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుంద‌ని స‌మాచారం. కాగా ఈ మూవీకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ పెట్టనున్నారు అనే వార్త‌ కూడా ప్రచారం లో ఉంది. మొత్తానికి ఈ సినిమా గురించి అందరిలో ఆస‌క్తి ఏర్ప‌డింద‌ని చెప్ప‌చ్చు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. మ‌రి.. ప్ర‌భాస్ తో మారుతి ఏ స్థాయి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.

Also Read : ప్ర‌భాస్, మారుతి క‌ధ ఇదేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్