Monday, February 24, 2025
Homeసినిమాధనుష్ మూవీలో తెలుగు హీరో

ధనుష్ మూవీలో తెలుగు హీరో

నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ భారీ పీరియాడికల్ ‘కెప్టెన్ మిల్లర్‘ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రంలో వెర్సటైల్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ప్రాజెక్ట్ లో చేరారు.

విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి బిగ్ స్టార్ల తో కలిసి సందీప్ చేస్తున్న ‘మైఖేల్’ చిత్రం కూడా భారీ అంచనాలను పెంచింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మానగరం’లో హీరోగా సందీప్ కిషన్ తన అద్భుతమైన నటనతో తమిళ ప్రేక్షకులను కూడా మెప్పించిన విషయం తెలిసిందే. సందీప్ ఇప్పుడు ‘కెప్టెన్ మిల్లర్’ ప్రాజెక్ట్ లోకి రావడం మరింత ఆకర్షణగా నిలిచింది.

తెలుగులో ధనుష్ కి అద్భుతమైన ఆదరణ వుంది. ఇపుడీ క్రేజీ కాంబినేషన్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ప్రేక్షకులని అలరించే చిత్రంగా వుండబోతుంది. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సహ నిర్మాతలు. ‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Also Read: మొన్న డస్సేన్ – నేడు క్లాసేన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్