Thursday, April 25, 2024
HomeTrending Newsసంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సెల్స్

సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సెల్స్

సంగారెడ్డి జిల్లా లోని మూడు మండలాల పరిధిలో గల 23 ల్యాండ్ పార్సెల్ అమ్మకాలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ సమావేశం విజయవంతమైంది. ఆర్ సి పురం లోని లక్ష్మీ గార్డెన్స్ లో జరిగిన ప్రీబిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ కె.గంగాధర్, పటాన్ చెరు తహసిల్దార్ పరమేష్, ఆర్ సి పురం తహసీల్దార్ జయరాం లతో పాటు హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారులు, ఎస్టేట్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు, బ్యాంకర్లు హాజరయ్యారు.

ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు దగ్గరలో అమీన్ పూర్, ఆర్ సి పురం, జిన్నారం మండలాలలో పరిధిలో అమ్మకానికి 23 ల్యాండ్ పార్సెల్స్ అమ్మకానికి ఉన్నాయి.

అందుబాటు ధరల్లో వెలిమల గ్రామంలోనే అందుబాటులో 121 గజాల నుంచి 3,630 గజాల స్థలాలు ఉన్నాయి.

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలం పరిధిలో పదహారు(16), అర్.సి పురం మండలంలో అరు(6), జిన్నారం మండలంలో ఒకటి(1) చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి.

మార్చి ఒకటో తేదీన మధ్యాహ్నం సెషన్ లో ఈ మొత్తం 23 ల్యాండ్ పార్సిల్స్ ను ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేలం జరుగనున్నది.

వంద శాతం (100%) ఎటువంటి చిక్కులు లేని, క్లియర్ టైటిల్ ఉన్న ఈ ల్యాండ్ పార్సెల్స్ ను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉంది.

Also Read : మేడిపల్లి లేఅవుట్ లో మార్చి 6న అన్ లైన్ వేలం

RELATED ARTICLES

Most Popular

న్యూస్