Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Sania Mirza: సొంత గడ్డపై సానియా భావోద్వేగం

Sania Mirza: సొంత గడ్డపై సానియా భావోద్వేగం

ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఫేర్ వెల్ మ్యాచ్ ఎల్బీ స్టేడియంలో ఆడారు. ఆమె కోరిక మేరకు స్వస్థలం హైదరాబాద్ లో దీన్ని ఏర్పాటు చేశారు. మ్యాచ్ ముగిసిన తరువాత సానియా ఉద్వేగం ఆపుకోలేక కంట తడి పెట్టింది. తనతో కలిసి ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన రోహన్ బోపన్న, ఇవాన్ డోడిగ్, కారా బ్లాక్, మారియన్ బర్తోలీ, మాంటెక్ శాండ్స్ లు ఈ మ్యాచ్ లో పాల్గొని ఆడారు.

కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మంత్రి కేటిఆర్, మాజీ క్రికెటర్లు అజారుద్దీన్, యువరాజ్ సింగ్ తదితరులు ఈ మ్యాచ్ కు హాజరయ్యారు.

 

కాగా, సాయంత్రం సానియా గౌరవార్ధం ఓ స్టార్ హోటల్ లో గలా డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు పాల్గొన బోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్