భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ టైటిల్ తో తన కెరీర్ కు గుడ్ బై చెప్పింది. మన దేశానికే చెందిన వెటరన్ క్రీడాకారుడు రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 లో బరిలోకి దిగింది.
నేడు జరిగిన ఫైనల్లో సానియా-బోపన్న జోడీ… ఇటాలియన్ జంట ల్యూసా స్టెఫానీ-మాటొస్ చేతిలో 7-6; 6-2 తేడాతో ఓటమి పాలైంది. మొన్న జరిగిన సెమీ ఫైనల్లో నీల్ కుప్సికి (ఇంగ్లాండ్)- డెసిరై మేరీ (అమెరికా) జోడీపై 7-6;2-1;తో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టారు.
కానీ నేటి ఫైనల్లో హోరాహోరీగా జరిగిన తొలి రౌండ్ లో ఇటాలియన్ జోడీదే పైచేయి అయింది. రెండో రౌండ్ లో భారత ద్వయం సమర్ధంగా ఎదుర్కోలేక ఓటమి పాలయ్యారు.
Also Read : టెన్నిస్ కు సానియా రిటైర్మెంట్