Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్India A – New Zealand A: వన్డే సిరీస్ కు సంజూ సారధ్యం

India A – New Zealand A: వన్డే సిరీస్ కు సంజూ సారధ్యం

మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ ‘ఏ’ జట్టు ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టెస్టులు డ్రా గా ముగియగా మూడో టెస్ట్ నిన్న (గురువారం) బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో మొదలైంది.  ఇండియా ‘ఏ’ టెస్టు జట్టుకు ప్రియంక్ పంచాల్ నేతృత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో సత్తా చాటుతున్న రజత్ పటీదార్, రుతురాజ్ గైక్వాడ్. సర్ఫ్ రాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, రాహుల్ చాహర్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆటగాళ్ళు ‘ఏ’ జట్టులో ఆడుతున్నారు.

బిసిసిఐ నేడు వన్డే జట్టును ప్రకటించింది. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంజూ శామ్సన్  ఇండియా ‘ఏ’ కు సారధ్యం వహించనున్నాడు. ఈ మూడు వన్డేలు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో  సెప్టెంబర్ 22, 25,27 తేదీల్లో జరగనున్నాయి.

టీమిండియా టి 20జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న ఎందరో ఆటగాళ్లకు వన్డే ‘ఏ’ జట్టులో చోటు కల్పించారు.

జట్టు వివరాలు: పృథ్వి షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటీదార్, సంజూ శామ్సన్ (కెప్టెన్), కెఎస్ భరత్ (కీపర్), కులదీప్ యాదవ్, షాబాద్ అహ్మద్, రాహుల్  చాహర్, తిలక్ వర్మ, కులదీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవదీప్ షైనీ, రాజ్ అంగద్ బవా

Also Read : Cricket: సురేష్ రైనా గుడ్ బై !

RELATED ARTICLES

Most Popular

న్యూస్