Saturday, March 14, 2026
HomeసినిమాAnni Manchi Sakunamule: ప్రమోషన్స్ లో స్పీడు పెంచిన సంతోష్ శోభన్

Anni Manchi Sakunamule: ప్రమోషన్స్ లో స్పీడు పెంచిన సంతోష్ శోభన్

స్వప్న సినిమా ప్రొడక్షన్ హౌస్ కథల ఎంపికలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో సంగీతం విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకుంటుంది. స్వప్న సినిమా వారి గత సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ సినిమా కూడా థియేటర్లలోకి రాక ముందే మ్యూజికల్ హిట్ అవుతోంది. సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు థర్డ్ సింగిల్‌ గల గల ఏరులా పాటని విడుదల చేసారు.

ఈ డ్రీమీ నెంబర్ ప్లజంట్ గా ప్రారంభమైయింది. మిక్కీ జే మేయర్ తనదైన శైలిలో శ్రోతలని మెస్మరైజ్ చేసే నెంబర్ ని కంపోజ్ చేశారు. విభిన్న వాయిద్యాలతో పాటని చాలా రిచ్ గా ఆర్కెస్ట్రేషన్ చేశారు. రెహ్మాన్ లిరిక్స్ రాశారు. నకుల్ అభ్యంకర్, రమ్య భట్ అభ్యంకర్ గానం మరింత ఆకర్షణని తీసుకొచ్చింది. ఇటలీలోని కొన్ని అందమైన లొకేషన్లలో ఈ పాట చాలా ప్లజంట్ గా చిత్రీకరించారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ఉత్సాహంగా కనిపించారు. వారి కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. కొరియోగ్రఫీ చక్కగా ఉంది. అన్నీ మంచి శకునములే చిత్రంలో రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. మే 18న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచాడు సంతోష్ శోభన్. మరి.. ఈ సినిమా అయినా సంతోష్ కి సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular