Friday, March 29, 2024
HomeసినిమాVyavastha: సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా విడుద‌లైన 'వ్యవస్థ' ట్రైల‌ర్‌

Vyavastha: సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా విడుద‌లైన ‘వ్యవస్థ’ ట్రైల‌ర్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తున్న జీ 5 త్వరలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో క‌ట్టి ప‌డేసే వ్యవస్థ అనే కోర్టు రూమ్ డ్రామాను అందిస్తుంది.  ఈ సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెర‌కెక్కించారు. ఇంత‌కు ఆయ‌న ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెర‌కెక్కించారు. కార్తీక్ ర‌త్నం, సంప‌త్ రాజ్‌, హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. ‘వ్య‌వ‌స్థ‌’ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా  విడుద‌ల చేశారు.

అందులో ఈరోజు న్యాయం రేప‌టి క్రైమ్ అయితే నేటి క్రైమ్ రేప‌టి చ‌ట్టం అవుతుంది అని ఓ లా కోర్సు ట్రైన‌ర్ త‌న స్టూడెంట్స్‌కు చెప్ప‌టంతో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. సంప‌త్ రాజ్ ఇందులో చ‌క్ర‌వ‌ర్తి అనే చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో చేసిన‌ట్లు తెలుస్తుంది. సిటీలోని లాయ‌ర్స్ అంద‌రూ త‌న జూనియ‌ర్స్‌గా నియ‌మించుకుని వారి పై అజ‌మాయిషీ సంపాదించ‌టం ద్వారా త‌ను చెప్పిందే జ‌రగాల‌నుకునే వ్య‌క్తిగా క‌నిపిస్తారు. యువ న‌టుడు కార్తీక్ ర‌త్నం ఇందులో కొన్ని నియమ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ప‌ని చేసే మంచి మ‌న‌సున్న జూనియ‌ర్ లాయ‌ర్ వంశీ పాత్ర‌ను పోషించారు. తను న‌త్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడు. దీని వ‌ల్ల త‌న‌ని తాను త‌క్కువ‌గా ఊహించుకుంటుంటాడు.

అయితే త‌ను హ‌త్యా నేరం మోప‌బ‌డిన యామిని అనే అమ్మాయిని కాపాడాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలో సిటీలోనే అతి పెద్ద లాయ‌ర్‌గా పేరు తెచ్చుకున్న చ‌క్ర‌వ‌ర్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. స‌మాజంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి యామినిని కాపాడ‌టానికి ఆమెకు అండ‌గా నిల‌బ‌డ‌తాడు. ఇందులో యామిని పాత్ర‌ను హెబ్బా ప‌టేల్ పోషించింది.అది ట్రైల‌ర్‌లో స్ప‌ష్టంగా తెలుస్తుంది. గాయ‌త్రి అనే పాత్ర‌లో కామ్నా జెఠ్మ‌లానీ క‌నిపించ‌నుంది. లా కాలేజ్‌లోనూ కొంత క‌థ న‌డుస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు తెలియ‌ని ఆస‌క్తిని పెంచే థ్రిల్లింగ్ స‌న్నివేశాల‌న్నీ ఈ ఒరిజిన‌ల్‌లో ఉండ‌బోతున్నాయి. ఏప్రిల్ 28 నుంచి వ్య‌వ‌స్థ స్ట్రీమింగ్ కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్