తెలుగు సినిమాలకు గత 20 ఏళ్లుగా అవార్డులు అందిస్తున్న ‘సంతోషం’ వారపత్రిక ఆధ్వర్యంలో 20 వ సంతోషం – సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుకలు ఈ నెల 14న హైద్రాబాద్ లో గ్రాండ్ గా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సంతోషం టీం అప్పుడే ప్రమోషన్ మొదలెట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఔట్ డోర్ డిజిటల్ ప్రమోషన్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు పలు పట్టణాలు, నగరాల్లో సంతోషం – సుమన్ టివి సౌత్ ఇండియా ఫిలిం అవార్డు వేడుకల యాడ్స్, ఈవెంట్ డీటెయిల్స్ తో అందిస్తున్న ప్రమోషన్స్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది.
ఈనెల 14న హైద్రాబాద్ లోని హెచ్ఐసిసి- నోవాటెల్ హోటల్ లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ ప్రాచుర్యం పొందింది. అదే తరహాలో ఈ నెల 14న జరగబోయే ఈ అవార్డు వేడుకల్లో తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ బాషల సినిమాలకు అవార్డులు అందచేయనున్నారు. సంతోషం అధినేత సురేష్ కొండేటి ఈ అవార్డు వేడుకలను ప్రతి ఏడాది ఓ యజ్ఞం లా జరుపుతున్నారు.
కరోనా సమయంలో గత రెండేళ్లు తప్ప మిగతా ప్రతి ఏడాది ఈ అవార్డులు అందచేశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు మృతి భారతీయ సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన జ్ఞాపకార్ధంగా ఎస్పీ బాలు పేరుతో అవార్డులు ఇవ్వడమే కాకుండా 100 పాటలు, వంద గలాలతో ఆయనకు స్వర నీరాజనం సమర్పించే మహత్తర కార్యక్రమం కూడా జరగబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ గా జరగనున్న ఈ వేడుకల్లో పలువురు తారల డ్యాన్స్, కామెడీ, హంగామాతో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతోంది.