Ap Cm Jagan Wish Telugu People All Over The World A Happy Deepaavali :

దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.

Must Read : దీపావళి రోజున బాలయ్య ‘అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌.బి.కె’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *