Saturday, January 18, 2025
Homeసినిమా'సరిపోదా శనివారం' కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్!

‘సరిపోదా శనివారం’ కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్!

నాని అభిమానులంతా ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 29వ తేదీ ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. నాని నుంచి సినిమా వచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నందు వలన ఈ సినిమా పట్ల వాళ్లంతా ఆసక్తితో ఉన్నారు. వారంలో 6 రోజుల పాటు హాయిగా .. ఆనందంగా పని చేసుకునే హీరో, శనివారం రోజున చిరాకు పడిపోవడానికి కారణం ఏమిటనేది కథ.

మొదట్లో చాలామంది ఇదేం టైటిల్ అనుకున్నారు. నాని ఇమేజ్ కి తగినట్టుగా లేదనీ .. తేలిపోతోందనే విమర్శలు వినిపించాయి. అయితే ఆ తరువాత ఈ టైటిల్ కి అలవాటుపడిపోయారు. ఈ సినిమాలో నాని జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తరువాత ఇద్దరూ కలిసి నటించిన సినిమా ఇది. నాజూకైన కథానాయికగా ప్రియాంకకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందువలన ఆమె వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు.

నానికి ‘దసరా’ తరువాత ఆ స్థాయి హిట్ పడలేదు. ఆ తరువాత ఆయన చేసిన ‘హాయ్ నాన్న’ ఫరవాలేదనిపించుకుంది. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందుగా నాని ‘అంటే .. సుందరానికీ’ సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు. అయినా ఆ దర్శకుడికే ‘సరిపోదా శనివారం’తో నాని మరో ఛాన్స్ ఇచ్చాడు. కామెడీ కంటెంట్ ను ఎక్కించడంలో వివేక్ ఆత్రేయకి మంచి పేరు ఉంది. అందువలన ఈ సినిమాలో ఎంటర్టైన్ మెంట్ పుష్కలంగా ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టుకుంటుందేమో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్