Sunday, January 19, 2025
Homeసినిమా‘స‌ర్కారు వారి పాట’ మ‌ళ్లీ వాయిదా?

‘స‌ర్కారు వారి పాట’ మ‌ళ్లీ వాయిదా?

Another Postpone: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ‘గీత గోవిందం’ ఫేమ్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘స‌ర్కారు వారి పాట‌’. ఇందులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇంకా.. ఓ ఇర‌వై రోజులు షూటింగ్ మిగిలివుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి టైమ్ లో మ‌హేష్ బాబు మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకోవాల్సి రావ‌డంతో షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. దుబాయ్ లో స‌ర్జ‌రీ చేయించుకున్నారు. అక్క‌డే న్యూయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుని ఇండియా వ‌చ్చాక… మ‌హేష్ కి క‌రోనా వ‌చ్చింది.

దీంతో మ‌హేష్ ప్ర‌స్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. జ‌న‌వ‌రి నెలలో ‘స‌ర్కారు వారి పాట’ తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు అయితే.. మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్ బాబు మ‌ర‌ణించ‌డంతో మ‌హేష్ బాగా డ‌ల్ అయ్యార‌ట‌. తాజా షెడ్యూల్ స్టార్ట్ అవ్వ‌డానికి ఇంకాస్త స‌మయం ప‌డుతుంద‌ట‌. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో సినిమా విడుదల మ‌రింత ఆల‌స్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు.. ఆ త‌ర్వాత ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 1న కూడా రావ‌డం లేదు అని టాక్. సంక్రాంతికి ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేయాలి అనుకున్నారు. త‌మ‌న్ ఫ‌స్ట్ సాంగ్ రెడీ చేశారు. అయితే.. ఇప్పుడు వాయిదా వేశార‌ని స‌మాచారం. ఈ లెక్క‌న స‌ర్కారు వారి పాట స‌మ్మ‌ర్ ఎండింగ్ కి అయినా వ‌స్తుందో లేదో అనుమానమే. మ‌రి.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : ‘లాల్ సింగ్ చద్దా’లో చైత‌న్య‌ పాత్ర పెంపు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్