After Sankranthi: నైట్ కర్ఫ్యూను సంక్రాంతి పండుగ తర్వాత నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ళ నాని వెల్లడించారు. సంక్రాంతి పండుగ రద్దీ, ప్రయాణాల దృష్ట్యా  కర్ఫ్యూ ను వాయిదా వేయాలంటూ ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.   ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను సమరించామని నాని చెప్పారు. 18 నుంచి నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించి, కోవిడ్ నిబంధనలు పాటించాలని నాని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ మూడో దశ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5  గంటల వరకూ నైట్ కర్ఫ్యూ ను అమలు చేయాలని నిన్న నిర్ణయించింది.

అయితే కొద్దిసేపటి క్రితమే నైట్ కర్ఫ్యూ మర్గదర్శకాలను విడుదల చేసింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ సమయంలో కూడా అనుమతి ఉంటుందని, అంతర్రాష్ట్ర ప్రయాణాలను అనుమతి ఉంటుందని పేర్కొంది. మాస్క్ ధరించకపోతే రూ.100 ఫైన్, పెళ్ళిళ్ళు, మతపరమైన ఫంక్షన్లకు 100 మంది, బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలకు 200 మందిని పరిమితం చేయాలని నిబంధన విధించారు. సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ తో నడపాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *