Saturday, April 20, 2024
Homeసినిమా‘రౌడీ బాయ్స్’ పెద్ద సక్సెస్ కావాలి : అల్లు అర్జున్‌

‘రౌడీ బాయ్స్’ పెద్ద సక్సెస్ కావాలి : అల్లు అర్జున్‌

Rowdy Boys with Bunny: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో…శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి శిరీష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘డేట్ నైట్..’ సాంగ్‌ను విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ ఫంక్ష‌న్ నాకెంతో స్వీట్‌. నా జీవితంలో ‘ఆర్య’ సినిమా ఎంతో ముఖ్య‌మైంది. సుకుమార్ గారు లేక‌పోతే ఆర్య సినిమా ఎలా లేదో.. దిల్ రాజు గారు కూడా లేక‌పోతే ఆర్య సినిమా లేదు. ఆ సినిమా షూటింగ్ చేసేట‌ప్పుడు.. ఆశిష్‌, అన్షు, హ‌ర్షిత్ అంద‌రూ చిన్న పిల్ల‌లు. షూటింగ్ స‌మ‌యంలో ప‌క్క‌న కూర్చునేవాళ్లు. నేను అప్పుడు వాళ్లు ఇంత స‌క్సెస్‌ఫుల్ ప‌ర్స‌న్స్ అవుతార‌ని అనుకోలేదు. ఇప్పుడు చూసి అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫంక్ష‌న్‌కి రావ‌డం నేను చేస్తున్న ఫేవ‌ర్ కాదు. నా బాధ్య‌త‌. డేట్ సాంగ్ చాలా బావుంది. చూస్తుంటే ఫిబ్ర‌వ‌రి 14న రావాల్సిన సినిమాను జ‌న‌వ‌రి 14నే రిలీజ్ చేస్తున్న‌ట్లు అనిపిస్తుంది”

రౌడీ బాయ్స్‌ ఎంటైర్ టీమ్‌కి అభినంద‌న‌లు. ఆశిష్ చాలా బాగా స్టెప్పులేశాడు. జ‌న‌వ‌రి 14న వస్తున్న ఈ సినిమావ‌స్తుంది. ఆల్ ది బెస్ట్‌. ఇదే సంద‌ర్భంలో కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వ‌స్తున్న సినిమాల‌న్నీ బావున్నాయి. ‘అఖండ‌’, మా ‘పుష్ప’ సినిమాలు వ‌చ్చాయి. అలాగే నాని గారి ‘శ్యామ్ సింగ‌రాయ్’ కూడా పెద్ద స‌క్సెస్ అయ్యింది. నాకు ఆ టీమ్‌కు కంగ్రాట్యులేట్ చేయడం కుద‌ర‌లేదు. ఇప్ప‌డు చెబుతున్నాను. నాని గారు స‌హా టీమ్ అంద‌రూ అద్భుతంగా చేశారు. డైరెక్ట‌ర్ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు బావుంది. ‘శ్యామ్ సింగ‌రాయ్’ చాలా బావుంది. సంక్రాంతికి చాలా సినిమాలు వ‌స్తున్నాయి. ఇది తెలుగు సినిమాలు గెల‌వాల్సిన స‌మ‌య‌మిది. అన్నీ సినిమాలు స‌క్సెస్ కావాలి’’ అన్నారు.

Also Read సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న ఆశిష్ ‘రౌడీ బాయ్స్’

RELATED ARTICLES

Most Popular

న్యూస్