Saturday, June 13, 2026
Homeసినిమా'శశివదనే' టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్

‘శశివదనే’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్

ర‌క్షిత్ అట్లూరి హీరోగా, కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా రూపొందుతోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా ‘శశివదనే‘. గౌరీ నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.వి.ఎస్. క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్ కంపెనీ ప‌తాకాల‌ పై సాయి మోహ‌న్ ఉబ్బ‌న ద‌ర్శ‌క‌త్వంలో అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు. త్వ‌ర‌లో సినిమా విడుదల కానుంది. ఈ రోజు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ టైటిల్ సాంగ్ విడుదల చేశారు. హ‌రి చ‌ర‌ణ్, చిన్మ‌యి శ్రీపాద పాడిన ఈ ‘శశివదనే’ పాట‌కు కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం అందించారు.

టైటిల్ సాంగ్ విడుదల చేసిన అనంతరం హరీష్ శంకర్ మాట్లాడుతూ… ”ముందుగా సంగీత దర్శకుడు శరవణన్ కు కంగ్రాట్స్. చాలా రోజుల తర్వాత మంచి శాస్త్రీయ సంగీతాన్ని విన్నాను. మంచి తెలుగు టైటిల్ పెట్టారు. నాకు బాగా నచ్చింది. శశివదనే అంటే మంచి చంద్రబింబం లాంటి ముఖం ఉన్న అమ్మాయి అని అర్థం. ఆల్ ది బెస్ట్ టు రక్షిత్, కోమలి. వాళ్లిద్దరి కెమిస్ట్రీ బావుంది. నిర్మాత అహితేజ, అభిలాష గారికి అడ్వాన్స్ కంగ్రాట్స్. ఒక్క సంగీతమే కాదు, సినిమాలో కూడా తెలుగు నేటివిటీ ఉంది. ‘చేతిలో చెయ్యి వేస్తే నువ్వు గీతలే మారవా?’ అని పాటలో లైన్ కూడా నాకు బాగా నచ్చింది. విజువల్స్ బావున్నాయి. మంచి సాహిత్యం, మంచి సంగీతంతో కూడిన చిత్రమిది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులు మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలను తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular