కొరియా ఓపెన్ -2023 పురుషుల డబుల్స్ లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చైనా ద్వయం లియాంగ్ వీ కెంగ్- వాంగ్ చాంగ్ పై 21-15; 24-22 తేడాతో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచారు.
రేపు జరిగే ఫైనల్ లో ఇండోనేషియా జంట ఫజర్ అల్ఫియన్- ముహమ్మద్ రియాన్ తో వీరు తలపడనున్నారు.
సాత్విక్- చిరాగ్ జోడీ జూన్ మూడో వారంలో జరిగిన ఇండోనేషియా ఓపెన్ టైటిల్ ను కూడా గెల్చుకున్న సంగతి తెలిసిందే.