Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Indonesia Open: పురుషుల డబుల్స్ విజేత సాత్విక్-చిరాగ్ జోడీ

Indonesia Open: పురుషుల డబుల్స్ విజేత సాత్విక్-చిరాగ్ జోడీ

భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ చరిత్ర సృష్టించారు. తమ కెరీర్ లో మరో టైటిల్ సాధించి చరిత్ర సృష్టించారు.  నేడు జరిగిన ఇండోనేషియా ఓపెన్-2023, పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్-చిరాగ్ ద్వయం 21-17;21-18 తేడాతో మలేషియా జోడీ ఆరోన్ చియా- షో వూ యిక్ పై విజయం సాధింఛి టైటిల్ చేజిక్కించుకున్నారు.

2018 ఆస్ట్రేలియా కామన్ వెల్త్ గేమ్స్ లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెల్చుకున్న ఈ ద్వయం 2023 బర్మింగ్ హాం కామన్ వెల్త్ లో స్వర్ణం గెల్చుకుంది,

2022 లో బి డబ్ల్యూ ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో మూడో స్థానంలో నిలిచారు.

నేటి విజయంతో ఈ జోడీ తమ కెరీర్ లో ఆరు బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బి డబ్ల్యూ ఎఫ్) టైటిల్స్ గెల్చుకున్నట్లు అయ్యింది. మరో రెండు సార్లు రన్నరప్ గా నిలిచారు.

ఈ ఏప్రిల్ లో జరిగిన ఆసియా బాడ్మింటన్ షిప్ లో కూడా ఈ జంట విజేతగా నిలిచింది,

ప్రస్తుతం వీరిద్దరూ డబుల్స్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్