Saturday, January 18, 2025
Homeసినిమా`ఆహా`లో స‌త్య‌దేవ్ ‘లాక్డ్‌’ సీజ‌న్ 2.

`ఆహా`లో స‌త్య‌దేవ్ ‘లాక్డ్‌’ సీజ‌న్ 2.

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా`లో బ్లాక్‌బ‌స్ట‌ర్ సర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ `లాక్డ్‌` రెండో సీజ‌న్ మొదలు కానుంది. వైద్య‌శాస్త్రంలో క‌ఠిన‌త‌ర‌మైన ఎన్నో కేసుల‌కు ప‌రిష్కారాల‌ను సూచించిన గొప్ప న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఆనంద్ పాత్ర‌లో మెప్పించ‌డానికి స‌త్య‌దేవ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే అత‌ని పేరు ప్ర‌తిష్టల‌ను నాశ‌నం చేయ‌గ‌ల ఓ ర‌హ‌స్యాన్ని ఈ ప్ర‌పంచానికి తెలియ‌కుండా దాచేస్తాడు. `లాక్డ్‌` సీజ‌న్ 1ను డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ దేవ కుమార్ రెండో సీజ‌న్‌ను కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ కు  వెళ్ల‌నున్న సీజ‌న్ 2లో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసే అంశాలెన్నో ఉంటాయి.

`లాక్డ్‌` సీజ‌న్ 1లో చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసే ముగ్గురు దొంగ‌లు డాక్ట‌ర్ ఆనంద్ ఇంట్లోకి ప్ర‌వేశిస్తారు. అక్క‌డ వారికి ఆనంద్ జీవితంలోని చీక‌టి కోణం గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లోకి ప్ర‌వేశించే ఎంతో మంది నిమిషాల్లో హ‌త‌మ‌వుతుంటారు. స‌త్య‌దేవ్‌, సంయుక్తా హెగ్డే, కేశ‌వ్ దీప‌క్‌, శ్రీల‌క్ష్మి, బిందు చంద్ర‌మౌళి త‌దిత‌రులు న‌టించిన తొలి సీజ‌న్ ప్రేక్ష‌కుల‌కు ప‌లు ట్విస్టులు, మలుపులతో  ప్రేక్ష‌కులు ఓ ఉత్కంఠ‌త‌కు లోన‌య్యారు. కథ ప‌రంగా, స్కేల్‌, విజ‌న్ ప‌రంగానే కాకుండా`లాక్డ్` రెండో సీజ‌న్ వెన్నులో ఓ భ‌యాన్ని క‌లిగించేంత ఎలిమెంట్స్‌తో తెలుగు మాధ్య‌మాల్లో మేకింగ్ స్టాండ‌ర్స్ ప‌రంగానూ స‌రికొత్త అర్థాన్ని చెప్పేలా ఉండ‌బోతుందని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్