Tuesday, March 10, 2026
Homeసినిమాక‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డ క‌ట్ట‌ప్ప‌

క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డ క‌ట్ట‌ప్ప‌

Kattappa out of Carona: తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌ని తెలియ‌డంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్ కి తీసుకెళ్లారు. ఆత‌ర్వాత నుంచి స‌త్య‌రాజ్ ఆరోగ్యం సీరియ‌స్ గా ఉంద‌ని..ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. డాక్ట‌ర్లు త్వ‌ర‌లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ఎలాంటి హెల్త్ బులెటిన్ రాలేదు.. ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ప్ర‌చారంలో ఉన్న వార్త వాస్త‌వ‌మేనా..?  ఆయ‌న‌కు సీరియ‌స్ గానే ఉందా అనే అనుమానాలు మ‌రింతగా పెరిగాయ‌ని చెప్ప‌చ్చు.

అయితే.. క‌ట్ట‌ప్ప‌కు సీరియ‌స్ గా ఉంద‌నే వార్త‌లు వాస్త‌వం కాదు అని తెలిసింది. సత్యారాజ్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా నుంచి కోలుకోవడమే కాదు.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. మరికొన్ని రోజులు హోమ్ ఐసొలేషన్ లో ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయాన్ని స‌త్య‌రాజ్ తనయుడు శిబి సత్యారాజ్ సోషల్ మీడియా వేదికగా తెలియ‌చేశారు. సిబి సత్యరాజ్ ఈరోజు ఉదయం సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ.. అప్పా నిన్న రాత్రి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత వ‌ర్క్ స్టార్ట్ చేస్తారు. మీరంద‌రూ చూపించిన‌ ప్రేమకు అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular