Saturday, January 18, 2025
Homeసినిమాభయపెట్టలేకపోయిన 'బ్లడీ ఇష్క్ ' 

భయపెట్టలేకపోయిన ‘బ్లడీ ఇష్క్ ‘ 

హారర్ టచ్ ఉన్న సినిమాలు చేయడానికి అవికా గోర్ ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వస్తోంది. ఆమె ప్రధానమైన పాత్రగా ‘బ్లడీ ఇష్క్’ సినిమా రూపొందింది. రాకేశ్ జునేజా నిర్మించిన ఈ సినిమాకి, విక్రమ్ భట్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా ‘డిస్నీ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై హారర్ థ్రిల్లర్ జోనర్ లోని కథలకు మంచి క్రేజ్ ఉంది. ఈ తరహా కంటెంట్ ను చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు.

అదే జోనర్లో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. వర్ధన్ పూరి .. రాహుల్ దేవ్ .. జెన్నిఫర్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. కథ విషయానికొస్తే .. నేహా – రోమేశ్ భార్యాభర్తలు. నేహా ఓ ప్రమాదానికి గురవుతుంది. ఆ సంఘటన కారణంగా ఆమె గతం మరిచిపోతుంది. తిరిగి ఆమెను మామూలు స్థితికి తీసుకుని రావడానికి ఆమె భర్త అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే అతను ఆమెను ఒక ఎస్టేట్ కి తీసుకుని వెళతాడు.

ఆ ఎస్టేట్ కి వెళ్లిన దగ్గర నుంచి నేహకి కొన్ని చిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. దాంతో ఆమె అదంతా దెయ్యాలపనే అని నమ్ముతుంది. ఆ ఎస్టేట్ లో దెయ్యాలు ఉన్నాయని భయపడుతూ ఉంటుంది. ఆ తరువాత నుంచి భర్తను అనుమానించడం మొదలుపెడుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే వారి జీవితంలోకి అయేషా ఎంటరవుతుంది. ఆమె ఎవరు? ఆమె రాకతో జరుగుతుంది? అనేది కథ. కొత్తదనం లేని కథ .. పేలవమైన స్క్రీన్ ప్లే నిరాశపరిచాయని టాక్. ఆశించిన స్థాయిలో ఈ సినిమా భయపెట్టలేకపోయిందనేది ప్రేక్షకుల మాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్