Friday, November 22, 2024
Homeజాతీయంసిఎం టూర్ లో పోలీసుల గొడవ

సిఎం టూర్ లో పోలీసుల గొడవ

హిమాచల్​ ప్రదేశ్ ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారికి, ఎస్పీకీ మధ్య  ఫైటింగ్ జరిగింది. ఈ విషయం హాట్ టాపిక్ గా మారడమే గాక ఈ వీడియో ఇప్పుడు  వైరల్ గా మారింది. సిఎం జై రాం ఠాకూర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి కులు జిల్లాలో పర్యటించారు. భుంతర్ విమానాశ్రయం వద్ద సిఎం కాన్వాయ్ ఆగిన సమయంలో ముఖ్యమంత్రి భద్రతా ఇన్ ఛార్జ్ గా ఉన్న అడిషనల్ ఎస్పీ కేడర్ అధికారి బ్రిజేష్ సూద్ ను కులు ఎస్పీ గౌరవ సింగ్ చెంపదెబ్బ కొట్టారు. వెంటనే సిఎం వ్యక్తిగత భద్రతాదికారిగా ఉన్న బల్వంత్ సింగ్ ఎప్సీని చేయి, కాలితో నెట్టారు, ఆ తరువాత బ్రిజేష్ కూడా ఎస్పీ చెంపపై చేయి చేసుకున్నారు.

వెంటనే తేరుకున్న ఇతర పోలీసులు, అధికారులు వారిని వారించి పక్కకు తీసుకెళ్ళి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు పోలీసు అధికారులనూ బలవంతపు సెలవుపై పంపుతున్నట్లు డిజిపి సంజయ్ కుండు వెల్లడించారు.

కేంద్ర మంత్రి, సిఎం పర్యటన సందర్భంగా అక్కడకు వచ్చిన ప్రజలు ‘ప్రధాని గడ్కరీ’ అంటూ నినాదాలు చేశారు, వారిని ఆ ప్రదేశానికి అనుమతించిన విషయంలో సిఎం భద్రతా సిబ్బందికి, జిల్లా పోలీసు యంత్రాంగానికి మధ్య మొదలైన వాదోపవాదాలు ఈ సంఘటనకు కారణమని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్