Saturday, January 18, 2025
Homeసినిమా‘మీర్జాపూర్ 3’ హిట్టా.. ఫట్టా? సీజన్ 4 కూడా ఉండబోతుందా?

‘మీర్జాపూర్ 3’ హిట్టా.. ఫట్టా? సీజన్ 4 కూడా ఉండబోతుందా?

‘మీర్జాపూర్’ 1 .. 2 సీజన్లు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబట్టాయి. దాంతో అంతా సీజన్ 3 కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొంత గ్యాప్ తరువాత ‘మీర్జాపూర్ 3’ అమెజాన్ ప్రైమ్ కి వచ్చేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సీజన్ అందుబాటులోకి వచ్చేసింది. 10 ఎపిసోడ్స్ ను ఈ సీజన్ క్రింద వదిలారు. దాంతో ఈ సీజన్ ఎలా ఉండనుందా అనే ఆసక్తితో చాలామంది చూస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన రెండు సీజన్లను కాస్త అటు ఇటుగా ఈ సీజన్ అలరిస్తోందని చెబుతున్నారు.

ఈ సీజన్ అంతా కూడా  గుడ్డూ భయ్యా – శరత్ అనే రెండు పాత్రల మధ్య నడుస్తుంది. మొదటి నుంచి చివరివరకూ ‘మీర్జాపూర్’ సింహాసనం కోసం వాళ్లు చేసే పోరాటమే ఈ కథ. ఇరు వైపులా గ్యాంగులు .. అనుచరులు .. వ్యూహాలు .. దాడులు .. ఇలా ఈ సిరీస్ కొనసాగుతుంది. అసలు మీర్జాపూర్ సింహాసనానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన కాలీన్ భయ్యా చనిపోయాడనుకుని ఈ ఇద్దరి మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఆయన బ్రతికే ఉన్నాడని తెలిసిన దగ్గర నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఇక ఈ మధ్యలో భరత్ త్యాగి ట్రాక్ కూడా చివర్లో మంచి ట్విస్ట్ ఇస్తుంది.

ఈ సీజన్ లో కూడా అభ్యంతరకరమైన డైలాగ్స్ .. సన్నివేశాలు .. హింస ఉన్నాయి. అయితే వాటి వెనుక నడిచే డ్రామా .. అది వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం .. పాత్రలను మలచిన విధానం కారణంగా ఈ సిరీస్ ఆదరణ పొందుతూ వస్తోంది. ఇక ఈ సీజన్ తో ఈ సిరీస్ కి శుభం కార్డు పడుతుందనే టాక్ వచ్చింది. కానీ సీజన్ 4 కూడా ఉందనే హింట్ ఇచ్చారు. సీజన్ 4లో కథ అంతా కూడా కాలీన్ భయ్యా .. గుడ్డూ భయ్యా మధ్య జరగనుంది. అందువలన ఇది మరింత ఉత్కంఠను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్