Saturday, April 20, 2024
Homeసినిమానాంది కాంబినేషన్లో మరో చిత్రం

నాంది కాంబినేషన్లో మరో చిత్రం

Hit Combo: హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది‘ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందటంతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తాజాగా నరేష్, విజయ్ కలయికలో రెండో చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. రక్తపు మరకలతో నిండిన సంకెళ్ళు వేసిన చేతులు, ఆ చేతుల నీడ గోడపై స్వేఛ్చగా ఎగిరే ఒక పక్షిలా కనిపించడం ఇంటరెస్టింగ్ గా వుంది. హై ఇంటెన్సిటీ తో కూడుకున్న ఈ పోస్టర్ క్యూరియాసిటీని పెంచింది.

తన తొలి చిత్రాన్ని విలక్షణమైన కథతో తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల రెండవ సినిమా కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఈ చిత్రం న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది ఈ సినిమాలో నరేష్ మరో ఇంటెన్స్ రోల్ లో కనిపించనున్నారు. అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం నరేష్ చేస్తున్న ”ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” పూర్తయిన తర్వాత ప్రారంభమవుతుంది.

Also Read : ‘నాంది’ రీమేక్ చేయనున్న దిల్ రాజు, అజయ్ దేవగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్