Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.

వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘ ‘దాక్కో దాక్కోమేక’ ప్రేక్షకుల అభిమానం చూరగొంటోంది. రష్మిక మందన్న పోస్తిస్తున్న శ్రీవల్లి  పాత్రకు సంబంధించిన పాటను అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యే విడుదలైన రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. చెవుల కమ్మలు పెట్టుకుంటూ ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 17న ‘పుష్ప: ది రైజ్’ విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com