Wednesday, June 17, 2026
HomeTrending Newsరెండో విడత ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్

రెండో విడత ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తొలి విడతగా 30 వేల 453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 3334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన జీవోలను జారీ చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడంజరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 30 వేల 453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు తెలిపింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది.

Also Read : నిరుద్యోగులకు తీపి కబురు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular