Monday, June 8, 2026
Homeసినిమా'ఎఫ్3' సెకండ్ సింగిల్ రెడీ

‘ఎఫ్3’ సెకండ్ సింగిల్ రెడీ

Second fun: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సూపర్ క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా ఏప్రిల్ 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాటని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్‌లో ప్రధాన తారాగణం రోప్ పుల్లింగ్ ఆట ఆడుతూ కనిపించారు. ఒక వైపు, తమన్నా, మెహ్రీన్ సోనాల్ చౌహాన్ తాడును లాగుతుండగా మరో వైపు వరుణ్ తేజ్ ఒంటరిగా కష్టపడటం, వెంకటేష్ తన మార్క్ స్టయిల్ లో వరుణ్ ని ప్రోత్సహించడం ఆకట్టుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కూల్‌గా కనిపిస్తుండగా, తమన్నా, మెహ్రీన్, సోనాల్ గ్లామర్‌గా కనిపిస్తున్నారు.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

Also Read : ‘ఎఫ్-3’ సెట్ లో బుట్ట‌బొమ్మ‌సంద‌డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular